Wednesday, January 30, 2013

Zero Democracy In A Big Democracy


ఆలోచింపజేసే వ్యాసం: http://greatandhra.com/viewnews.php?id=43704&cat=10&scat=37

 రోజురోజుకీ అద్వానంగా తయారౌతాంది యవ్వారం. ఫలానోడినో ఫలానా గ్రూపునో తలిస్తే కేసు, నోరెత్తితే కేసు. ఏమిరా అంటే మనోభావాలు డ్యామేజీ అయిపొయినాయని అంటారు. కానీ వాళ్ళు మాత్రం సాచానా?

అంతెందుకు  facebookలో పొద్దున్నె లేస్తే బాలయ్య మీద బ్రహ్మానందం మీద జోకులెయ్యడమే కద కొందరి పని. మరి వారికి ఉండవ మనోభావాలు? ఒకరిని తప్పు పట్టే ముందు మనం బాగుండామా లేదా చూసుకోవలసిన అవసరం లేదా.

ముందు కాలంలో "వాడి పాపాన వాడు పోతాడు" అని ఊరుకొనె వారు. గొడవ ఆడితో పొయ్యేది. కాలం మారింది. దానిని చైతన్యం అంటారొ అసహనం అంటారో దేవుడికే తెలియాలి. ఎదుటోడు మనల్ని చెడ్డగా అనొచ్చుగాక, మనవరకు ఒకళ్ళ ఉసురు పోసుకోకండా ఉంటే సాలు.